kamareddy | బాన్సువాడ, ఏప్రిల్ 9 : కల్తీ కల్లు తయారీదారులు, విక్రయదారులను ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణముగా బడుగు జీవుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని బీజేపీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, బీబీ పాటిల్, నీలం రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
నస్రుళ్లబాద్, బీర్కూర్ మండలాల్లో దుర్కి, అంకోల్, అంకోల్ తాండ, దామరాంచ, గాంధారి మండలం గౌరారం గ్రామాల్లో కల్తీ కల్లు బారిన పడి బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను వారు స్థానిక బీజేపీ నాయకుల తో కలిసి బాధితులను పరామర్శించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కల్తీ కల్లు తయారీ చేసి బడుగుల ప్రాణాలను హరిస్తుంటే అబ్కారీ శాఖ, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నిలువెత్తు నిదర్శనం అన్నారు. వెంటనే బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాలని, కల్తీ కల్లు బాద్యుల లైసెన్స్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు.
వారి వెంట నాయకులు పైడి మల్ లక్ష్మీ నారాయణ, కోణాల గంగారెడ్డి, శంకర్ గౌడ్, గుడుగుట్ల శ్రీనివాస్, సాయిరెడ్డి, అందే చిరంజీవి, చిదుర సాయిలు, జగదీశ్వర్ తదితరులు ఉన్నారు.