నస్రుల్లాబాద్, డిసెంబర్ 19 : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అ న్నారు. నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రా మంలో 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13 లక్షల మంది లబ్ధిదారులకు సుమారు రూ.10వేల కోట్లను ప్రభుత్వం ఈ పథకం కింద పంపిణీ చేసిందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదన్నారు. బాన్సువాడ పట్టణంలో 100 పడకల ప్రసూతి దవాఖాన నిర్మించామని తెలిపారు. ఈ నెల 21వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ అం దించే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అనంతరం నాచుపల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మించి శ్రీ గిరిధారి ఆగ్రో ఇండస్ట్రీని ఆ యన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, సర్పంచ్ విజయ, విండో చైర్మ న్లు సుధీర్, మారుతి, మండల రైతు బంధు సమి తి అధ్యక్షుడు సాయిలు యాదవ్, తహసీల్దార్ బావయ్య నాయకులు ప్రతాప్ సింగ్, నాయిని హన్మాండ్లు, దుర్గం శ్యామల, భూమేశ్, మహేందర్, సాయిలు, నారాయణ, లక్ష్మీనారాయణ గౌడ్, పురం వెంకటి తదితరులు పాల్గొన్నారు.