Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర కాలనీలో నిర్మించిన ఈ ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి వివిధ కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి 19 వరకు వివిధ కార్యక్రమాలను తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కొనసాగుతున్నాయి.
ఆలయంలో పుష్కర బ్రహ్మోత్సవాల సందర్భంగా కాలనీ లో పండగ వాతావరణం నెలకొంది. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిత్యారాధన ద్వాదశతోరణం ధ్వజ కుంభారాధన తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో నిత్యం గోవర్ధన రాఘవాచార్యుల ఆధ్వర్యంలో పలువురు ఆచార్యులు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. నిత్యం పూజా కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆలయం ఆలయం నిర్మాణం జరిపించి 12 ఏళ్లు కావడంతో ఈ ఏడు వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించాలనే యోచనతో సుమారు రెండువేల ముందు నుంచి వివిధ కార్యక్రమాలను రూపొందించి వాటిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు కొనసాగుతుండగా కాలనీకి చెందిన మహిళలు పురుషులు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.