Kotagiri | కోటగిరి, జనవరి 20 : ఆర్య వైశ్యుల అరాధ్య దైవం శ్రీ వాసవీ కనకా పరమేశ్వరీ మాతా ఆత్మార్పణ దినం పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నగరేశ్వర మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ మాతా, వాసవీ చాలీసా, వాసవీ అష్టోత్తరం పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ మాతా ఆత్మార్పణ దినం ప్రతీ సంవత్సరం మాఘ మాసం లో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఆర్యవైశ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు కొండరాజు, మా శెట్టి సాయి ప్రసాద్ మాశెట్టి మహేష్, మాశెట్టి గణేష్, నరేందర్, శ్రీనివాస్, లక్ష్మీకాంత్, లక్ష్మీరాజ్, గోరంటి నరేందర్, శేఖర్, బాలాజీ, శంకర్, పోల అశ్విన్, మహిళలు పాల్గొన్నారు.