Bodhan | బోధన్‌లో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం
బోధన్ పట్టణం బీటీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సైత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలోఉత్సవ విగ్రహాలతో హోమం నిర్వహించారు.
Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణం బీటీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సైత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలోఉత్సవ విగ్రహాలతో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను బోధన్ పట్టణానికి చెందిన ప్రవీణ్ మహారాజ్, నర్సింగ్ పల్లి తిరుమల తిరుపతి దేవాలయం అర్చకులు రోహితా ఆచార్య మంత్రోచ్ఛారణాల మధ్య నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మల్లారం లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకుడు పిట్ల కృష్ణ మహారాజ్ ముఖ్యఅతిథిగా హాజరై భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. కలియుగంలో కొంత సమయాన్ని భగవన్నామస్మరణకు కేటాయించాలని అన్నారు. సనాతన హైందవ ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని,.ధర్మం నిలబెట్టేందుకు, తల్లిదండ్రుల మాట, గురువుల మాట వినాలని దైవ నామస్మరణతో మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. పిల్లలకు ధర్మం గురించి నేర్పాలని, పూర్వీకుల చరిత్రను వినిపించాలని, తల్లితండ్రుల సేవ ఎంతో ముఖ్యమని, దేశ భవిష్యత్ గురించి రుషి సాంప్రదాయం మనదేశంలోనే ఉందని చెప్పారు.
చరిత్రలో ప్రతీ గొప్ప వ్యక్తి వెనుక గురువులు వున్నారని, మనం చేసే మంచే మనల్ని కాపాడుతోందన్నారు. సర్వేజనా సుఖినో భవంతు అని కోరేది మన ధర్మమని, బోధన్ పట్టణానికి ఎంతో చరిత్ర ఉందని, దీనికి బహుధాన్యపురం అని పిలిచేవారని, ప్రముఖ ఏక చక్రెశ్వర ఆలయం బోధన్ లోనే ఉందన్నారు. దేవాలయాలు, ధర్మాన్ని కాపాడడం ప్రతీ ఒక్కరి భాధ్యత అని అన్నారు. డబ్బు కోసం వేంపర్లట తో పాటు సమయాన్ని ఆధ్యాత్మిక కు కూడా కేటాయించాలన్నారు. కార్యక్రమాలను ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తున్న పసులేటి గోపికిషన్, బృందాన్ని అభినందించారు. కార్యక్రమానికి నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, సత్యా గౌడ్, కొలిపాక బాల్ రాజు, రాజులదేవి, పవన్ కుమార్, గుంత గంగాధర్ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

