Pitlam | పిట్లం, జూలై24 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేష్ ఆధ్వర్యంలో ఆలయంలో కేటీఆర్ పేరుపై పూజలు నిర్వహించి, ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జొన్న శ్రీనివాస్ రెడ్డి, అరికెల శ్రీనివాస్ రెడ్డి, నర్సా గౌడ్, జంబిగె హనుమండ్లు, మోతి, రవి, సత్యం, ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.