Kotagiri | కోటగిరి, జూలై 19 : వానకాలం ప్రారంభంపై నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వానలు కురవలేదని, చెరువులు ఎండిపోయాయని, రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని వానలు బాగా కురవాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలోని ఈద్గా వద్ద మైనార్టీల ఆధ్వర్యంలో మైనారిటీ సోదరులు ఆదివారం (దువా) ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండాలని ప్రతి ఇంటికి సుఖసంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా ప్రసాదించాలని మైనార్టీ సోదరులు అల్లా ను కోరుతూ ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఏత్తొండ మాజీ ఎంపీటీసీ సయ్యద్ ఫారూక్, మసీద్ సదర్ అన్వర్, మౌలా అల్లావుద్దీన్ సర్దార్ గౌస్ ఆసిప్, ఘన్ని తదితరులు పాల్గొన్నారు.