పెద్ద కొడప్గల్ : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర ఆలయంలో ( Papa Hareswara Temple) మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్సై మహేందర్ (SI Mahender) , భక్తులు, మహిళలు ఆలయంలో ప్రత్యేక పూజలు , రుద్రాభిషేకం చేశారు. పురోహితులు బాబన్న పంతులు, వెంకటకృష్ణ పంతులు ఆధ్వర్యంలో సామూహిక రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి 9 గంటలకు ఆలయంలో హరి భక్త పారాయణ రాములు మహారాజ్తో కీర్తన భజన కార్యక్రమాలుంటాయని ఆలయ పూజారి తెలిపారు.