బాన్సువాడ రూరల్ : ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గ్రామపంచాయతీలలో వందశాతం పన్నుల వసూలుకు (Tax collection) ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టామని ఎంపీవో సత్యనారాయణ రెడ్డి (MPO Satyanarayana Reddy) తెలిపారు. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో పన్నుల వసూలుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో (Special Drive) ఆయన పాల్గొన్నారు.
గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన పన్నుల వసూళ్ల వివరాలు గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంతికి అడిగి తెలుసుకున్నారు. వందశాతం పన్నులు వసూలు చేయాలని కార్యదర్శికి ఆదేశించారు. గ్రామస్థులు పెండింగ్ బకాయిలను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆయన వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి సృజన్ రెడ్డి , కారోబార్ హనుమాండ్లు తదితరులు ఉన్నారు.