Admissions | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం అధ్యాపకుల స్పెషల్ డ్రైవ్
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ శ్రీ రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ /పీజీ కళాశాలలో 2026-2027 డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు.
Admissions | బాన్సువాడ రూరల్, జూన్ 9 : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ శ్రీ రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ /పీజీ కళాశాలలో 2026-2027 డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇందూరు గంగాధర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం డిగ్రీలో ప్రవేశాల కోసం అత్యధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. దోస్త్ అప్లికేషన్లో జిల్లాలో ఎస్.ఆర్.ఎన్.కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు.
ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలకై దోస్త్ అప్లికేషన్లలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు పీజీలో ప్రవేశాలపై ప్రవేశ పరీక్ష రాయాలని సూచించారు. కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ తో పాటు ఎన్.సీ.సి ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్.ఆర్.ఎన్.కె డిగ్రీ కళాశాలకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

