ఖలీల్వాడి, జూలై 9: ఈ నెల 21న అరుణాచలంలో నిర్వహించే గిరిప్రదక్షిణకు నిజామాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు టీజీఆర్టీసీ ప్రాంతీయ అధికారి జానిరెడ్డి తెలిపారు. బస్సు ప్రయాణం వివరాలను మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 19న రాత్రి 8 గంటలకు నిజామాబాద్ నుంచి బయల్దేరి 20న ఉదయం 10గంటలకు కాణిపాకం చేరుకొని విఘ్నేశ్వరుని దర్శనానంతరం సాయంత్రం 5 గంటలకు వేలూరు గోల్డెన్ ఆలయం చేరుకుంటుంది. అనంతరం రాత్రికి అరుణాచలం చేరుకుంటుంది. గిరిప్రదక్షిణ పూర్తయిన తర్వాత 21న సాయంత్రం 5గంటలకు అరుణాచలం నుంచి బయల్దేరి 22న ఉదయం 4గంటలకు జోగులాంబ ఆలయానికి చేరుకుంటుంది. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 6గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.4200, పిల్లలకు రూ.3,400లు ఉంటుందని, అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చెందిన భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించు కోవాలని కోరారు. www. tsrtconline.in ద్వారా లేదా మీకు సమీప బస్సు రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుందని రీజినల్ మేనేజర్ పేర్కొన్నారు.