Kotagiri | విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి…. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులను ఆదేశించారు.
- అభ్యసన ఫలితాలను మెరుగుపర్చాలని ఉపాధ్యాయులకు ఆదేశం
- ఏతొండ ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేసిన బోధన్ సబ్ కలెక్టర్
Kotagiri | కోటగిరి, మార్చి 26 : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులను ఆదేశించారు. కోటగిరి మండలం ఎతొండ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. పలువురు విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించిన పాఠాలపై అరా తీశారు. విద్యార్థులతో స్వయంగా చదివించారు. విద్యార్థుల ప్రతిభపై సబ్ కలెక్టర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆరో తరగతి విద్యార్థుల ఎండ్ లైన్ పరీక్ష పత్రాలను సమీక్షించారు. విద్యార్థుల చదవడం ,రాయడం నైపుణ్యాలను కూడా అంచనా వేసి ప్రత్యేక కృషి ద్వారా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. విద్యార్థుల గైర్హాజరు పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పీరియడ్ ప్లాన్ ప్రకారం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయ సహాయక బృందం విద్యార్థులపై అదనపు శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ గంగాధర్, మండల విద్యాధికారి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

