బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 10 : బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో రూ. 50లక్షలతో నిర్మించిన శ్రీ సీతారామాలయంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ఉత్సవా లు ఆదివారంతో ముగిశాయి. ఉదయం నుంచి యంత్ర ప్రతిష్ఠాపన, మూర్తి ప్రతిష్ఠ, మహా స్థా పం, ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన తదితర కార్యక్రమాలు కొనసాగాయి.
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సతీమణి పుష్పమ్మతో పాటు కుటుంబీకులు శంభురెడ్డి-ప్రమీల, పరిగె వెంకట్రాంరెడ్డి – అరుణ, పోచారం రవీందర్‌రెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి, సర్పంచ్ రాధ దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్పీకర్ ఆవిష్కరించారు. కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, బాన్సువాడ, బోధన్ ఆర్డీవోలు భుజంగ్‌రావు, రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథరెడ్డి, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.