వర్ని, ఫిబ్రవరి 15 : వర్ని మండలం సిద్ధాపూర్లో రిజర్వాయర్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు బుధవారం మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా చర్యలు, బహిరంగ స్థలం వద్ద ఏర్పాట్లు, సమావేశానికి హాజరయ్యే ప్రజలకు సౌకర్యాలు, భోజన వసతి తదితర వివరాలను అధికారులతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్పీకర్ వెంట ఎల్లారెడ్డి ఎమ్మె ల్యే సురేందర్, ఉమ్మడి డీసీసీబీ చైర్మన్ పో చారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ బర్దావల్ హరిదా స్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గంగారాం, సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, నా యకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సిద్ధాపూర్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. హెలిప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేశారు. హెలీప్యాడ్ నుంచి రిజర్వాయర్ శంకు స్థాపన స్థలానికి చేరుకునేందుకు వీలుగా రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. శంకుస్థాపన స్థలం వద్ద పైలాన్ సిద్ధమైంది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు.
నిజామాబాద్ క్రైం,ఫిబ్రవరి 15 : మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్ర తా చర్యలు చేపట్టారు. సీపీ నాగరాజు పర్యవేక్షణలో సివిల్, ఆర్ముడ్ రిజర్వు పోలీస్ బలగాలు భద్రతలో ని మగ్నమయ్యాయి. సిద్ధాపూర్లో శంకుస్థాపన కార్యక్రమంతో పాటు సభా వేదిక వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబు డిస్పోజల్, డాగ్ స్కాడ్ బృందాలు మంత్రి ప్రయాణించే దారి వెంట తనిఖీలు నిర్వహిస్తాయి. ఇద్దరు ఏసీపీలతో పాటు ఐదుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 30 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 19 మంది ఏఎస్సైలు, 19 మంది హెడ్‌కానిస్టేబుళ్లు,127 మంది కానిస్టేబుళ్లు, 52 మంది మహిళా కాని స్టేబు ళ్లు, 27 మంది హోంగార్డులు, 13 మంది మహిళా హోంగార్డులు బందో బస్తులో ఉంటారు. వీరితో పాటు ప్రత్యే కంగా 5 రోప్ పార్టీలను సైతం రంగంలోకి దింపారు.