సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దీపం పట్టి వెతికినా ఏ రాష్ట్రంలోనూ పల్లెదవాఖానలు కనిపించవని చెప్పారు. బీర్కూర్ మండలం దామరంచలో గురువారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. బీర్కూర్‌లో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
– బీర్కూర్, ఏప్రిల్ 20
బీర్కూర్, ఏప్రిల్ 20: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం ఆయన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామం లో రూ.16 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన భవనం, రూ.3.35 కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించారు. రూ. 2 లక్షలతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం, స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం రూ. 20 లక్షలతో చేపట్టనున్న సహకార కేంద్రం గిడ్డంగి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. దీపం పెట్టి వెతికినా పల్లె దవాఖానలు ఏ రాష్ట్రంలోనూ కనిపించవని అన్నారు.
మన రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, కంటివెలుగు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, 24 గంటల్ ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల రూపకల్పన దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిచ్చికూతలు మానుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీటిని నిజాంసాగర్‌లో కలుపడంతో రెండు పంటలకు ఎలాంటి ఢోకా లేకుండా పోయిందన్నారు. కేసీఆర్‌కు ఈ ప్రాంత రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని, మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. కార్యక్రమంలో ఆరీవో రాజాగౌడ్, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో భానుప్రకాశ్, గ్రామ సర్పంచ్ విఠల్, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, ఎంపీటీసీ సందీప్, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, నాయకులు ప్రదీప్, అబ్దుల్ నబీ, శశికాంత్, ద్రోణవల్లి అశోక్, కమ్మ సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీఈసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్, బీఆర్ఎస్పై గీతం.. ఆవిష్కరించిన స్పీకర్
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై నాందేడ్వాసులు సందీప్బూరే, స్వరాజ్రాథోడ్, డా.లక్ష్మీకాంత్ రూ పొందించిన ‘ఔర్ ఏక్‌బార్ కిసాన్ సర్కార్’ అనే హిందీ గీతంతోపాటు పోస్టర్లను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగు రాష్ట్రం వారు ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఇందుకు నిదర్శనం మహారాష్ట్రలో జరిగే సభలు విజయవంతం కావడమే అన్నా రు. పాటను రూపొందించిన వారిని స్పీకర్ అభినందించారు.