రుద్రూర్, జూన్ 13: కేసీఆర్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా మంగళవారం బాన్సువాడ నియోజకవర్గస్థాయిలో మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించా రు. వర్నిమండల కేంద్రంలోని సీసీడీ కల్యాణ మం డపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు.. మహిళా సంక్షే మ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి వివరించారు. అనంతరం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో మహిళల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు. సమాజంలో మహిళ ప్రా ధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఢిల్లీని పాలించే రాజైనా తల్లికి మాత్రం కొడుకే అని అన్నారు. తల్లి పెంచి పెద్ద చేస్తేనే పెద్దవాడయ్యేది రాజయ్యేది అని పేర్కొన్నారు.
తల్లి పాల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు. తల్లి పాలను ప్రోత్సహించే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో బాన్సువాడ ప్రభుత్వ దవాఖాన ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నా రు. ప్రభుత్వం ఆరోగ్యకరమైన సమా జాన్ని నిర్మించడం కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింత లు, చిన్నారులకు పౌష్టికా హారం అందజేస్తున్నదని తెలిపారు. ఆరోగ్యం విషయంలోనే కాకుండా రాష్ట్రం ప్రతిరంగంలో అభివృద్ధి సాధించేలా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి రంగంలో ఉన్న మహిళలను గుర్తించారని తెలిపారు. డబుల్బెడ్రూం ఇండ్ల పథకం, ఆసరా పెన్షన్, రైతుబంధు, రైతుబీమా ఇలాంటి ఎన్నో పథకాలు అమలుచేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. తాను ఇప్పటి వరకు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. అన్ని ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పాలించే ధైర్యం ఉన్న వారు కావాలన్నారు.
సీఎం కేసీఆర్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. అంతకుముందు అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన ఆహార మేళాను సందర్శించారు. వారు తయారుచేసిన ఆహార పదార్థాలను రుచిచూసి అభినందించారు. కార్యక్రమంలో భాగంగా పలు మండలాలకు చెంది న లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్పీకర్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీవోలు రాజేశ్వర్, రాజాగౌడ్, రుద్రూ ర్, కోటగిరి, వర్ని, మోస్రా ఎంపీపీలు అక్కపల్లి సుజాతా నాగేందర్, వల్లెపల్లి సునీత, మేక శ్రీలక్ష్మీ వీర్రాజు, ఉమాశ్రీరాము, ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిరి, పత్తి లక్ష్మణ్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మహిళలు పాల్గొన్నారు.