బాన్సువాడ, డిసెంబర్ 25 : దేవుడి ఆశీర్వాదంతోనే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. మనదేశం భిన్న మతాలు, ఆచారాలకు నిలయమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటించాలని సూచించారు. బాన్సువాడ సీఎస్ఐ చర్చికి ఇప్పటికే రూ. 30 లక్షలు ఇచ్చామని, మిగిలిపోయిన పనులను పూర్తిచేసేందుకు మరో రూ. 10 లక్షల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.