కామారెడ్డి, నవంబర్ 1 : జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ.. కేసుల్లో పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగా పరిష్కరించాలని అన్నారు. సైబర్ క్రైం ద్వారా బాధితులు కోల్పోయిన డబ్బులు త్వరగా రీఫండ్ అయ్యేలా చూడాలని సూచించారు.
పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించాలని అన్నారు. అనంతరం రెండు వారాల స్టేషన్ రైటర్ శిక్షణ పూర్తి చేసుకున్న 18 మంది మహిళా అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు నాగేశ్వర్రావు, సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ జార్జ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మురళి, జిల్లాలోని ఎస్సైలు పాల్గొన్నారు.