నస్రుల్లాబాద్, డిసెంబర్ 22 : బాలికలు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో తాత్కాలిక భవనంలో తరగతులు, వసతి ఏర్పాటు చేశామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దుర్కి గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే సందర్శించారు.
ఈ సందర్భంగా గురుకులంలో అందుతున్న సౌకర్యాలు, భోజన వసతిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాన్సువాడ మండలం హన్మాజీపేట్-కోనాపూర్ సమీపంలో శాశ్వత భవన నిర్మాణానికి రూ.12 కోట్లతో శంకుస్థాపన జరిగిందన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యాక గురుకులాన్ని అక్కడికి తరలిస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంట పాఠశాల ప్రిన్సిపాల్ నీలిమ, ఉపాధ్యాయులు ఉన్నారు.