కోటగిరి, మార్చి 11: కోటగిరి మండలం నాచుపల్లి తండాలో తాగునీటి సమస్యపై ఈ నెల7న ‘తాగునీటికి తండ్లాట’అని నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామంలో బోరు మోటరుకు మరమ్మతులు చేశారు. మిషన్‌భగీరథ అధికారులు సైతం రోజూ తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు ‘నమస్తే తెలంగాణ’కు ధన్యవాదాలు తెలిపారు.