డిచ్పల్లి/ఖలీల్‌వాడి/నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 17: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై జిల్లా కేంద్రానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావుతో కలిసి జీవన్‌రెడ్డిని సన్మానించారు. సీఎం కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం సందర్భంగా జీవన్‌రెడ్డి కేక్ కట్చేయించి బాజిరెడ్డికి తినిపించారు. 44వ నంబర్ హైవేపై జీవన్‌రెడ్డికి పార్టీ శ్రేణులు అడుగడుగునా స్వాగతం పలికాయి. స్వాగతం పలికిన వారిలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్‌నాయక్, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, గడ్డం సుమనారవిరెడ్డి, వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, డిచ్పల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు చిలువేరి గంగదాస్, ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మాధవనగర్‌లో సాయిబాబా ఆలయంలో జీవన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్ నీతూకిరణ్, ఈగ గంగారెడ్డి, సత్యపాల్, సుజిత్‌సింగ్ ఠాకూర్ తదితరులున్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు, ఆశన్నగారి జీవన్‌రెడ్డి స్వాగత కార్యక్రమాలతో నగరం గులాబీ మయమైంది.
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నగరంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించగా, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఏసీపీ వెంకటేశ్వర్ పర్యవేక్షణలో సీఐలు ప్రతాప్‌రెడ్డి, శ్రీశైలం, జగడం నరేశ్, విజయ్‌బాబు, కృష్ణతోపాటు ట్రాఫిక్ సీఐ చందర్‌రాథోడ్, ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు.
బోధన్, ఫిబ్రవరి 17: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు బోధన్ నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా గురువారం బయల్దేరి వెళ్లారు. కార్లు, బైక్‌లతో కూడిన ఈ ర్యాలీకి బోధన్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎమ్మెల్యే షకీల్ కొద్దిసేపు బుల్లెట్‌ను నడిపి ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా తయారుచేయించిన తలపాగలను ధరించారు.
మాక్లూర్/నందిపేట్/ధర్పల్లి/ఆర్మూర్, ఫిబ్రవరి 17: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు మాక్లూర్ మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్దకు తరలివెళ్లారు. ఎంపీపీ ప్రభాకర్‌తో పాటు నాయకులు సత్యం, రజినీష్, సుధాకర్, రంజిత్, భూషణ్, సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లి స్వాగత ర్యాలీలో పాల్గొన్నారు. నందిపేట్ మండలం నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలు స్వాగత ర్యాలీకి తరలివెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బైకులు, వాహనాల్లో వెళ్లి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జీవన్‌రెడ్డి స్వాగత ర్యాలీకి ధర్పల్లి నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి ర్యాలీగా జిల్లాకేంద్రానికి చేరుకొని సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు.