Sirikonda | సిరికొండ, మార్చి 17 : సిరికొండ గ్రామపంచాయతీలో తై బజార్‌కు మంగళవారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో పలువురు వ్యాపారులు పాల్గొని వేలం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పోటా పోటీగా పాట కొనసాగింది. రూ.6లక్షల 3వేల 2వందలకు కర్క భూమన్న తైబజార్‌ను దక్కించుకున్నాడు. గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారం వేలం పాట నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వేలం పాట ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చినట్లు సర్పంచ్ మల్లెల సాయిచరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శంకర్, నరసయ్య, విడిచి చర్ల స్వామి, బాయ్స్ చిల్డ్రన్ రామస్వామి గౌడ్,పంచాయతీ కార్యదర్శి వినీల్ తదితరులు పాల్గొన్నారు.