కోటగిరి, మార్చి 11 : మహిళల భద్రత, వేధింపుల నివారణ కోసం 24 /7 పని చేస్తుందని ఎస్ఐ సునీల్
అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు షి టీమ్స్ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈవ్ టీ జింగ్, వేధింపులకు పాల్పడి వారిని పట్టుకోవడం కౌన్సిలింగ్ ఇవ్వడం చట్టపరమైన చర్య తీసుకోవడం అలాగే బడులు, కళాశాలలో అవగాహన కార్యమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
షీ టీమ్స్ బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాప్ లో, కాలేజీల వద్ద మహిళను వేధించవారిని సివిల్ డ్రెస్ లో ఉండి పట్టుకుంటారన్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంలో షీ టీమ్స్ చురుకుగా వ్యవహరిస్తుందన్నారు. సైబర్ నేరాలు పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఏఎస్ఐ ఆశయ్య, రేణుక, ఉపాధ్యాయులు బర్ల సాయిలు, విద్యార్థులు తదితరులు ఉన్నారు