కోటగిరి : మాదక ద్రవ్యాలు సమాజానికి హానికరమని, వీటి నిర్మూలనకు పోలీసులు కృషి చేస్తున్నారని ఎస్ఐ సునిల్ అన్నారు. మంగళవారం కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునిల్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్ములకు విద్యార్థులు, యువత కృషి చేయాలన్నారు.
మాదక ద్రవ్యాలతో కలిగే చెడు పరిణామాలను గుర్తించాలని, గంజాయి, డ్రగ్స్ బారినపడి యువత జీవితాలు కోల్పోతున్నారని తెలిపారు. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాకారం దిశగా పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.