డిచ్పల్లి : డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు మైక్ సెట్ ను ఎన్నారై స్వగ్రామానికి చెందిన పూర్వ విద్యార్థిని దీపా రెడ్డి మైక్ సెట్ ను శనివారం అందజేశారు. తన స్వగ్రామమైన పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదగడంతో తన పాఠశాలకు ఏదైనా చేయాలని ఉద్దేశంతో రూ.50 వేలతో పాఠశాలకు ఎంపీల్ వైర్ బాక్స్‌లను అందజేసినట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలను చూడడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. తాను ఎప్పుడూ పాఠశాలకు ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని, ఎల్లప్పుడూ పాఠశాల కు సహకారం అందిస్తానని చెప్పారు. విద్యార్థులు ఉన్నత చదువు చదివి తల్లిదండ్రులకు గురువులకు, గ్రామానికి జిల్లాకు మంచి గౌరవం తీసుకురావాలని సూచించారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కు సహాయ సహకారాలు అందించిన ఎన్నారై దీపారెడ్డి కి విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు పాఠశాలపై ఉండాలని హెచ్ఎం నరేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయ రెడ్డి, నరేందర్ రెడ్డి, కుమార్తెలు రూపా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ వీడి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తో పాటు విద్యార్థినీ విద్యార్థులు తదితరులున్నారు.