పోతంగల్ ఫిబ్రవరి 19: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హాంగర్గ బీసీ కాలనీలో ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద బుధవారం నాడు శివాజీ 395 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి మహరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు.
గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శివాజీ మహారాజ్ చిత్రపటంతో శోభాయాత్ర, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు శివాజీ అని పలువురు పేర్కొన్నారు. సమాజ హితం కోసం పని చేసిన శివాజీ మహరాజ్ ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ వేడుకలో గ్రామస్తులు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.