నిజామాబాద్ : జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. గొర్రెల మందపై దాడి చేయడంతో పలు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన గంగాధర్ అనే గొర్రెల కాపరికి చెందిన మందపై కుక్కలు దాడి చేయడంతో పది గొర్రెలు, రెండు మేకలు మరణించాయి. సుమారుగా లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లినట్టు బాధితుడు వెల్లడించాడు.