ఆర్మూర్, మార్చి 2: మండలంలోని ఆలూర్ గ్రామ పాఠశాలలో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదుల మంజూరు, పాఠశాలకు మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం, నీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం తదితర విషయాలను మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ.. పనుల నివేదికను తయారుచేసి అందజేయాలని సూచించారు. ఆర్మూర్ ఎంపీడీవో గోపీబాబు, పీఆర్ ఏఈ నితిశ్, సర్పంచ్ కల్లెం మోహన్, ఎంఈవో పింజ రాజగంగారాం, ఎంపీవో సుభాష్ చంద్రబోస్, హెచ్ఎం కవిత, పంచాయతీ కార్యదర్శి, ఎంపీటీసీ మార్కంటి లక్ష్మీమల్లేశ్, ఉపసర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్, ఆర్మూర్ వైస్ ఎంపీపీ మోతె భోజకళా చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి, మార్చి 2: డిచ్పల్లి మండలంలోని గొల్లపల్లి పాఠశాలను మండల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో చందర్‌నాయక్ ఆధ్వర్యంలో అధికారుల బృందం సందర్శించింది. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో కల్పించాల్సిన మౌలిక వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్ మౌనిక, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ భూమేశ్వర్, హెచ్ఎం బి.రాజేంద్రగౌడ్, సర్పంచ్ లింగం యాదవ్, పంచాయతీ కార్యదర్శి ఇలియాస్, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ ప్రసాద్, సీఆర్పీ అంబదాస్రావు తదితరులు పాల్గొన్నారు.
నవీపేట, మార్చి 2: మండలంలోని అభంగపట్నం, నవీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మండల ప్రత్యేకాధికారి, మిషన్ భగీరథ ఈఈ కే.రాకేశ్ ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. పాఠశాలలకు కావాల్సిన మౌలిక వసతులను గుర్తించి తమకు నివేదిక అందజేయాలని ప్రత్యేకాధికారి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, అభంగపట్నం సర్పంచ్ రమాదేవి, పీఆర్ ఏఈ శ్రావణ్‌కుమార్, వైస్ ఎంపీపీ హరీశ్ తదితరులు ఉన్నారు.