నేటి నుంచి మోగనున్న బడిగంట
వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. నిన్న, మొన్నటి వరకు ఆటపాటలు, వేసవి శిబిరాలతో బిజీగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
- ఉమ్మడి జిల్లాలో తెరుచుకోనున్న పాఠశాలలు
కామారెడ్డి, జూన్ 14 : వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. నిన్న, మొన్నటి వరకు ఆటపాటలు, వేసవి శిబిరాలతో బిజీగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
వేసవి సెలవుల్లో అమ్మమ్మ, బంధువుల ఇండ్లకు వెళ్లిన చిన్నారులు ఇక ఆట పాటలకు గుడ్‌బై చెప్పి పాఠశాలలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. సోమవారం అమావాస్య కావడంతో మొదటిరోజు పాఠశాలలకు తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా లేదా? అనేది చూడాలి. పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కామారెడ్డి డీఈవో మల్లికార్జున్ తెలిపారు.
పలు పాఠశాలల్లో సమస్యల తిష్ట
బడులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటివరకు శుభ్రం చేయకపోవడం గమనార్హం. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే దానిని తొలగించాలని కోరుతున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

