మాక్లూర్/నందిపేట్, జూలై 9: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. మాక్లూర్, నందిపేట మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ మంగళవారం సందర్శించి పనులను పరిశీలించారు. మాక్లూర్ మండలం ముల్లంగి, బొంకన్పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో వంటగ ది, వరండా, అదనపు గదులు, వాటర్సంప్, టాయిలెట్స్ తదితర నిర్మాణాలు, మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాపై ఆరా తీశారు. పాఠశాలల్లో వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన పనులను మాత్రమే చేపట్టాలని, నా ణ్యతా ప్రమాణాలు పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపాలని సూచించారు. వానకాలం నేపథ్యం లో పాఠశాలల పరిసరాలను శుభ్రం గా ఉంచాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాలల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. నర్సరీని పరిశీలించారు. అనంతరం నందిపేట మండల కేంద్రంలోని డీఎస్, రాజానగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాల, నర్సరీని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సందర్శించా రు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారులు ముత్తెన్న, జగన్నాథచారి, పంచాయతీరాజ్ ఈఈ బావన్న, తహసీల్దార్ షబ్బీర్, ఎంపీడీవోలు జైక్రాంతి, కిరణ్, ముల్లంగి గ్రామప్రత్యేకాధికారి డాక్టర్ ఉమామ, ఏపీఎం అనిల్, ఏపీవో ఓంకార్ ఉన్నారు.