బోధన్ రూరల్, జూన్ 12: బోధన్ మండలంలోని భవానీపేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యార్థులు లేరని 11 ఏండ్ల క్రితం మూసివేశారు. ఇటీవల చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అదే పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఎంఈవో నాగయ్యతో కలిసి గురువారం పునఃప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు శివన్నారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.