Pothangal | పోతంగల్, జనవరి 2 : బస్టాండ్ ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్తగా ఎన్నికైన పోతంగల్ గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య భజరంగ్ పరిశుభ్రత పనులు చేపట్టారు. ఏళ్ల నుండి బస్టాండ్ లో గల టాయిలెట్లలో మురుగు నీరు నిలిచి రోడ్డు పక్కన వెళ్లే వారికి దుర్గంధం వెదజల్లుతోంది.
దీంతో శుక్రవారం టాయిలెట్లకు సంబంధించి న పైప్ లైన్లను జేసీపీ ద్వారా తీసి సమస్యను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యాదవ్, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.