Kamareddy | కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో ఆదివారం రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చింతల దివ్య రవితేజ గౌడ్, ఉపసర్పంచ్ గుడికాడి ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులను గౌడ సంఘం, కురుమ సంఘం, శాలిసంఘం, గంగపుత్ర సంఘం, మేధారి సంఘంతో పాటు ప లు సంఘాల నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు రాజా గౌడ్, కుమార్ గౌడ్, నరసింహులు, అశోక రెడ్డి, రమేష్ గౌడ్, మల్లేష్, భాస్కర్, నరేష్, యాదయ్య, లింగం, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు