శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ (Sant Ravidas Maharaj) 648 జయంతి వేడుకలను మోచి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ కులం మానవత్వానికి అడ్డుగోడలు కడుతుందని నాడే హెచ్చరించిన తపస్వి రవిదాస్ మహారాజ్ అన్నారు. హిందూ సమాజంలో (Hindu Samajam) కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా ఉన్న రోజుల్లో తన భక్తి గీతాలు ద్వారా కవితల ద్వారా ఎవరినైనా ప్రశ్నించవచ్చానే ధైర్యాన్ని నింపిన గొప్ప మహనీయుడని అన్నారు.
ఆధ్యాత్మికవేత్తల్లో ఒకరైన సంత్ రవిదాస్ మహారాజ్ మోచికులస్తులకు గురువు కావడం గర్వంగా ఉందన్నారు. ఆయన జీవితాన్ని యువత, మోచి కులస్తులు ఆదర్శంగా తీసుకొని జీవితాలను కొనసాగించాలని, ఇతరులకు ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని రాకాసిపేట్ లోని మోచి సంఘ భవనంలో కూడా నిర్వహించారు. కార్యక్రమంలో మోచి సంఘం అధ్యక్షుడు కొండ్లెపు సాయిలు, నాయకులు వొటర్కర్ వివేక్, పవన్, లింగయ్య, కావల్ల సాయిలు, వోటర్ కర్ లింగేష్, కావల్ల శేఖర్ ఉన్నారు.