వర్ని, ఏప్రిల్ 9: ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొనడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వర్ని మండల కేంద్రంలోని జాకోర ఎక్స్ రోడ్డు వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఎస్సై వంశీకృష్ణ కథనం ప్రకారం.. బాన్సువాడ డిపోనకు చెందిన బస్సు హన్మాజిపేట్ మీదుగా వర్నికి వస్తుండగా.. పొతంగల్ నుంచి ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది.
ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 71 మంది ప్రయాణికులు ఉన్నారు. టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.