ఎన్నికల్లో ప్రకటించిన జీవనభృతి, బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని, కార్మికుల పొట్టకొట్టే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ, అంగన్వాడీ, బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు సోమవారం ఆందోళన చేపట్టారు. పెండింగ్ వేతనాల కోసం నవీపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు ధర్నా చేశారు.