Taekwondo competitions | కంటేశ్వర్, జనవరి 11 : నిజామాబాద్ అమ్మెచ్యూర్ థైక్వాండో అసోసియేషన్ క్రీడాకారి సాయి ప్రసన్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు అమీచూర్ థైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరగబోయే థైక్వాండో నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్నట్టు తెలిపారు.
సబ్ జూనియర్ అండర్-32 కేటగిరి లో స్టేట్ లెవెల్ లో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సాయి ప్రసన్న జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించి నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాయి ప్రసన్నకు పలువురు అభినందనలు తెలిపారు.