NHAI | కంటేశ్వర్, సెప్టెంబర్ 10 : రహదారి నిర్మాణంలో భద్రతాప్రమాణాలు మెరుగుపరచాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కామారెడ్డి పీడీ సీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారం తో సేవ్ లైప్ ఫౌండేషన్ నిజామాబాద్ లో రోడ్డు నిర్మాణ సమయం లో పని ప్రాంతాల భద్రత ను మెరుగు పరచడంపై బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి నిర్మాణ సమయం లో పని ప్రాంతాల భద్రతను మెరుగు పరచడం కోసం ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రహదారుల ప్రణాళిక దశ నుండి నిర్వహణ దశ వరకు భద్రతా చర్యలను చేర్చుకోవాల్సిన అవసరాలను గుర్తించడమే ఈ వర్క్‌షాప్ ప్రధాన ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. రహదారి భద్రతను మరింత మెరుగుపరచడంతో పాటురోడ్డు ప్రమాదాలను నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వారికి నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్, మెర్సిడెస్-బెంజ్ వంటి సంస్థల భాగస్వాముల నైపుణ్యం నుండి వారు ప్రయోజనం పొందుతారని, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అలవర్చుకుంటారని, కొత్త జ్ఞానాన్ని పొందడానికి ఈ వర్క్‌షాపును పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారు.
సేవ్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీఈవో తివారీ మాట్లాడుతూ రహదారి భద్రత, పని ప్రాంతాలలో నిర్లక్ష్యం చేస్తే కార్మికులు, ప్రయాణికులకు అత్యధిక ప్రమాదాలను కలిగిస్తాయని చెప్పారు. ప్రణాళిక దశ నుండి నిర్వహణ వరకు భద్రతా చర్యలను సమగ్రపరచడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్, హైవే అభివృద్ధి ప్రతీ దశలోనూ భద్రతా సంస్కృతిని నిర్మించడానికి ఎన్హెచ్ఏఐ, మెర్సిడెస్-బెంజ్ తో భాగస్వామ్యం కలిగి ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఎన్హెచ్ఏఐ, కన్సెషనరీల నుండి ఇంజనీర్లు పాల్గొన్నారు.