వినాయక నగర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident ) ముగ్గురు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో మితిమీరిన వేగంతో వచ్చిన కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.