Road Accident | బాల్కొండ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు వెళ్తుండగా విషాదకర ఘటన చోటు చేసుకున్నది. 44వ నంబర్ జాతీయ రహదారిపై బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద కారు-లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చింతల్‌కు చెందిన ఆరుగురు హోండా టీఎస్ 07ఎఫ్పీ 8899 కారులో ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు బయలుదేరారు.
వాహనం చిట్టాపూర్ ఎక్స్‌రోడ్ వద్ద లారీని ఓవర్టేక్ చేయబోగా.. లారీ వెనుకాలే కారు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో వనం సంపత్ రాణా (26) అనే వ్యక్తి మృతి చెందాడు. పోతు రమేశ్,చంద్రశేఖర్ చారి, వనం శ్రీనివాస్, రజనీకాంత్, పోతు సాయి విశాల్, వనం సంపత్ రాణా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆర్మూర్ ఆసుప్రతికి తరలించారు. ఆక్సిడెంట్‌కు కారణమైన లారీ డ్రైవర్ కిషన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.