Nizamabad | కంటేశ్వర్, నవంబర్ 28 : రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సవాయి మాన్సింగ్ స్టేడియం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-2025 నవంబర్ 25 నుండి నవంబర్28 వరకు జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ భువనేశ్వర్, ఒడిస్సా రాష్ట్రం తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ క్రీడల్లో బంగారు పతకంతోపాటు రెండు కాంస్య పథకాలు సాధించింది.
పోటీలలో 50 మీటర్స్ బెస్ట్ స్ట్రోక్ లో బంగారు పథకం, 4×100 మిడ్లే రిలేలో కాంస్య పథకం, 4×200 ఫ్రీ స్టైల్ రిలేలో కాంస్య పథకం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్వికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఉమేష్, ఉపాధ్యక్షులు జీ మైపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడిల శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు కర్ణాటక శ్రీనివాస్, శ్యాంసుందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ముత్యాల శ్రీనివాస్, రాగిణి తదితరులు అభినందించారు.