SSC Results Pothangal | పోతంగల్, ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన రితీక మండల టాపర్గా నిలిచింది.
మండలంలో మొత్తం ఆరు జిల్లా పరిషత్ పాఠశాలలు ఉండగా సుంకినీ కల్లూర్, పోతంగల్ ఉర్దూ మీడియం స్కూల్ లలో 100 శాతం ఫలితాల్లో ముందు ఉండగా, కారెగం పాటశాల (95.45) శాతం, హంగర్గఫారం (94.73) శాతం పోతంగల్ తెలుగు మీడియం (98.86) శాతం ఉత్తీర్ణులయ్యారు. పోతంగల్ జెడ్పీహెచ్ఎస్ తెలుగు మీడియం పాఠశాలకు చెందినా రితిక 600 మార్కులకు గాను 546 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది.
రెండో స్థానంలో పోతంగల్ ఉర్దూ మీడియం పాఠశాలకు చెందిన చాంద్ బి 538 మార్కులు సాధించింది. వీరికి ఎంఈఓ శంకర్, తెలుగు మీడియం హెచ్ఎం సాయిలు, ఉర్దూ మీడియం హెచ్ఎం విమల అభినందించారు.