కొనసాగుతున్న వరద
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వదర కొనసాగుతున్నది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి 32,821 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,076.90 అడుగులు (37.114 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది.
- ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటి మట్టాలు
మోర్తాడ్/నిజాంసాగర్/నాగిరెడ్డిపేట, ఆగస్టు 5: ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వదర కొనసాగుతున్నది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి 32,821 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,076.90 అడుగులు (37.114 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 8,900 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమ ట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) గాను, ప్రస్తుతం 1,398.37 అడుగులు (9.69 టీఎంసీల) నీరు ఉందని ఏఈఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టుకు అనుసంధానంగా ఉన్న సింగీతం రిజర్వాయర్‌లోకి ఎగువ భాగం నుంచి 663 క్యుసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా ప్రవహిస్తుండడంతో అంతే స్థాయిలో మూడు వరద గేట్ల ద్వారా నీటిని నిజాంసాగర్ ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి పోచారం ప్రాజెక్టులోకి 3,229 క్యూసెక్కుల వరద వస్తున్నదని ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చిన వరద వచ్చినట్లు దిగువకు వెళ్లిపోతున్నది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

