కామారెడ్డి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ( Jagdishwar Reddy ) ని అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా మాజీ శాసనసభ్యులు, గంప గోవర్ధన్, బీఆర్ఎస్ (BRS) కామారెడ్డి జిల్లా అధ్యక్షులు యంకె ముజీబొద్దీన్ ఆదేశానుసారం కామారెడ్డి ( Kamareddy ) నిజాంసాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) దిష్టి బొమ్మ దహనం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షధోరణి అవలంబిస్తుందని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సస్పెన్షన్ చేయడం దారుణమని నాయకులు పేర్కొన్నారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ , బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పిప్పిరి ఆంజనేయులు ,పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్ , సీనియర్ నాయకులు గోపీగౌడ్ , గెరిగంటి లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, చెలిమెల భాను, తదితరులు పాల్గొన్నారు.