Jeevan Reddy | జగిత్యాల, జూలై 23 : రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయ కోణంతో కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారని, కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యదర్శి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ దావా వసంత, కౌన్సిలర్స్, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎల్ నినో ప్రభావంతో తల్లడిల్లుతుంటే, ఏవిధంగా అధిగమించాలని ఆలోచించకుండా, రేవంత్ రెడ్డి రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారని విమర్శించారు.
ప్రాణహిత నది జలాలు కరువు వచ్చినపుడు వినియోగించుకేందుకు కేసీఆర్ దూరదృష్టితో రైతులు ఇబ్బంది పడకుండా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారనీ తెలిపారు. మేడిగడ్డ మరమ్మతులు చేసిన తర్వాత వినియోగించుకోవాలని ఎన్డిఎస్ఎ సూచించిందన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల ఈర్ష్య ద్వేషంతో కుంగిన పిల్లర్లను మర్మమత్తు చేపట్టడంలేదన్నారు. కన్నెపల్లి పుంపు హౌస్ వద్ద 93.5 మీటర్లు నిల్వ వద్ద నీటిని ఎత్తిపోయవచ్చని సాంకేతిక నిపుణులు, నీటి పారుదల శాఖ ఇంజినీర్లు సైతం సూచించారు. కేటీఆర్ బాధ్యత గల నాయకుడిగా కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించి, ప్రభుత్వానికి సూచనలు చేస్తే, రేవంత్ రెడ్డి సానుకూలంగా తీసుకోవాల్సింది పోయి, నిర్లక్ష్యం చేశారన్నారు. వేదిర శ్రీరామ్, కన్నెపల్లి పంపు హౌస్ నుండి నీటిని తరలించవచ్చు అని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మినహా ప్రతీ ఒక్కరూ నీటినీ ఎత్తిపోయవచ్చని పేర్కొంటున్నారు. ఎన్డిఎస్ఏ సభ్యుడు రాకేష్ తేజ సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితిలో నీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఎల్ నినో వల్ల ఏర్పడిన దుర్భిక్ష పరిస్థితులను అధిగమించాలని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించి, ముంచస్తు చర్యలు చేపట్టాలనీ సూచించారు. రేవంత్ రెడ్డి మొన్నటి వరకు సన్నవడ్లు పండించాలని చెప్పారని, పునాస దాటిన తర్వాత ఎవరైనా పంటలు వేస్తారా..? అని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు సగం కూడా నాట్లు వేయలేదు, సాంకేతిక ఆకాశాన్ని వినియోగించుకోవాలని చెబుతున్న రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు అన్నారు. దేవుడే చెబుతున్నాడని పంప్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయని, ఏదైనా బ్యారేజ్ నిర్మాణం చేసేటప్పుడు సహజంగా నీటిని మళ్లించేందుకు ఇసుక బస్తాలు వేసి మళ్లిస్తాం, కన్నెపల్లి దిగువన కాపర్ డాం నిర్మాణం చేసి, ఎతిపోసుకోవచ్చని, తాగు నీటికి కూడా కోరత ఏర్పడి హైదరాబాద్ నగరం ఖాళీ అయ్యేట్టు కనపడుతుందన్నారు. కేసీఆర్ పాలనలో 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేశారన్నారు. ప్రస్తుతం విద్యుత్ రాత్రి ఎప్పుడూ వస్తుందో తెలియడం లేదు, హైడ్రో పవర్ అవకాశం లేదని, థర్మల్ పవర్ స్థానిక అవసరాలకే సరిపోతుందన్నారు. నీటిని ఎత్తిపోసేమ్దుకు అవకాశమున్నప్పటికీ ఎత్తిపోయకుండా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్వారెడ్డి తెచ్చిన కరవు స్పష్టం చేశారు.
వరద కాల్వ ఎండిపోయి, క్రికెట్ స్టేడియంలా మారిందని, నేషనల్ హైవే పైమంత్రి లక్ష్మణ్ కుమార్ పోలీస్ బందోబస్తు మధ్య గంట సేపు ధర్నా చేశారని, వరద కాలువలకు నీరు విడుదల చేయాలని రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తే పోలీసులు తమను ఈడ్చుకెళ్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ఓ నీతి.. జీవన్ రెడ్డి కో నీతి ఉంటదా అని, రైతుల సంక్షేమం కోసం పోరాటం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పై కోపం ఉంటే ఎన్నికల్లో చూసుకుందామని, రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు రూ.వంద కోట్లు ఖర్చు చేశారని, రైతుల కోసం రూ.పది కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ లో మేడిగడ్డకు సంబంధం లేకుండా కన్నెపల్లి నుండి నీటిని తరలించవద్దని నివేదికలో పేర్కొంటే చూపెట్టాలని సవాలు విసిరారు. 2004 వరకు చంద్రబాబు నాయుడు కాలంలో కరువు చూసిన, చంద్రబాబు దారిలో నడిచే రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కరువు వచ్చిందన్నారు.
వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా లేదనీ, తన భూమిలో తాను సామాజిక అడవుల పెంపకం చేసేందుకు పూనుకున్నానన్నారు. భూములు లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పారని, ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డిని నిలదీశారు. నీట్ పేపర్ లీక్ పై ఉద్యమిస్తున్న వారిపై లాఠీచార్జీ చేయడానికి నిరసనగా కేటీఆర్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ రద్దు చేసుకొని, ధర్నా చేస్తున్నారని పేర్కొన్నారు. కన్నెపల్లి వద్ద నీటిని ఎతిపోయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి, పంటకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్ రావు, దుర్గయ్య, జున్ను రాజేందర్, శీలం ప్రవీణ్, గాజుల రాజేందర్, ఓల్లెం మల్లేశం, శీలం సురేందర్, పుప్పాల అశోక్, రాధాకిషన్, నక్క జీవన్, మల్లారెడ్డి, కచ్చు హరీష్, సుధాకర్, గంగారాం, మహిపాల్, ప్రదీప్, పలువురు నాయకులు పాల్గొన్నారు.