Namaste Telangana | పోతంగల్ : మండలకేంద్రంలోని వడ్డెర కాలనీలోని తాగునీటి సరఫరా పైపులైన్లకు కలిగిన అంతరాయాన్ని తొలగించినట్లు అధికారులు తెలిపారు. ‘తాగు నీటి సమస్యను పరిష్కరించండి సారూ.. పొతంగల్ మండల కేంద్రంలో తీవ్రమైన ఇబ్బందులు’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’ వెబ్ న్యూస్ లో గురువారం వార్తా కథనం ప్రచురితమైంది.
కాగా ఈ కథనానికి అధికారులు స్పందించారు. మండల కేంద్రంలోనీ ఎస్సీ కాలనీ, వడ్డెర కాలనీ, బాజిరెడ్డి కాలనీలలో గత కొన్ని రోజులుగా తాగునీటితో సతమతమవుతున్న ప్రజలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ వార్తను ‘నమస్తేతెలంగాణ’ వెబ్సైట్ లో ప్రచురించింది. కాగా అధికారులు వడ్డెర కాలనీకి వెళ్లి నీటి సరఫరాలో జరిగిన అంతరాయాన్ని తొలగించారు.
ఈ సందర్భంగా అధికారులు నమస్తేతెలంగాణ’తో మాట్లాడుతూ వడ్డెర కాలనీలోని నీటి సమస్యను పరిష్కరించామని, బాజిరెడ్డి కాలనీ, ఎస్సీ కాలనీలల్లో మరో రెండు రోజుల్లో నీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.