శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో కుక్కల బెడద, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం బీజేపీ పట్టణ కమిటీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి బోధన్ పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపికిషన్ మాట్లాడుతూ పట్టణంలో కుక్కలు, దోమల బెడద రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. ప్రధానంగా పాన్ గల్లీ, సరస్వతి నగర్, తట్టికోట్, షర్బతీ కెనాల్, బసవతారక నగర్, రాకాసి పేట్, గోశాల ఏరియాల్లో అధిక సంఖ్యలో కుక్కలు రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయన్నారు.
అదే విధంగా వర్షాకాలం కావడంతో దోమల బెడద కారణంగా ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్ (చిన్న), మాజీ కౌన్సిలర్ గొడుగు ధర్మపురి, బిజెపి బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపురం అరవింద్, కందికట్ల వాసు, గుంత గంగాధర్, బీజేవైఎం బోధన్ పట్టణ అధ్యక్షులు ఏనుగంటి గౌతం గౌడ్, రవీందర్, భూమయ్య,రాజు , శ్రీను తదితరులు పాల్గొన్నారు.