IPS Soumya Mishra | వినాయక్ నగర్, అక్టోబర్ 27 : వివిధ నేరాల లో జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించిన ఖైదీల లో మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉపాధి అందిస్తూ వారి లో పూర్తి మార్పు కోసమే జైళ్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం ప్రాంతంలో జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతనగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును సోమవారం రోజు ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఎవరో ఒకరు తెలుసో తెలియకో నేరాలకు పాల్పడతారని, అందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధిస్తుందని అన్నారు. జైలు శిక్ష పడి, వారి శిక్ష కాలం పూర్తయిన అనంతరం జైలు నుంచి విడుదలైన ఖైదీల ల్లో సత్ప్రవర్తన రావడంతో అలాంటి వారికి ఉపాధి కోసం జైల శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సౌమ్య మిశ్రా తెలిపారు. జైలు నుంచి విడుదలైన ఖైదీలలో పురుషులకు పెట్రోల్ బంకులు, మహిళా ఖైదీల కోసం కుట్టుమిషన్లు ఇతర స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇందుకు గవర్నర్ అనుమతి కావాలని ఒక సందర్భంలో గవర్నెన్స్ ఆమోదం కోసం తాము వెళ్ళినప్పుడు ఖైదీలను విడుదల చేస్తున్నారు కానీ వారిలో సత్ప్రవర్తన రావడం లేదు అని ప్రస్తావించినప్పుడు తనకు ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఖైదీలకు అవకాశం కల్పిస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని తాను చెప్పడం జరిగినట్లు ఆమె తెలిపారు.ఈ అవకాశాన్ని విడుదలైన ఖైదీలు సద్వినియోగపరుచుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ళ శాఖ అధికారులు, నిజామాబాద్ సెంట్రల్ జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్, తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.