భీమ్గల్, జులై 1 : నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల విద్యుత్ శాఖ నూతన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీ)గా రాజేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇన్చార్జి ఏడీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ పరిపాలన కొనసాగుతుండగా, ప్రభుత్వం ఇటీవల రాజేందర్ రెడ్డిని శాశ్వత ఏడీగా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యుత్ శాఖ టౌన్ ఏఈ సత్యప్రసాద్, శాఖ అధికారులు, సిబ్బంది, లైన్మెన్లు రాజేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన ఏడీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ టౌన్ ఏఈ సత్యప్రసాద్, శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది, మండలంలోని వివిధ గ్రామాల లైన్మెన్లు తదితరులు పాల్గొన్నారు.