Nizamabad | కోటగిరి, అక్టోబర్ 3 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ సార్వజని ఉత్సహ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర కోటగిరి శ్రీ విఠలేశ్వర మందిరం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు అమ్మ వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గామాత శోభాయాత్రను ప్రారంభించారు. భక్తి పాటలతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కోటగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కూచి సిద్దూ, కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, బీ ఆర్ఎస్ మండల నాయకులు తేల్ల రవికుమార్, గాండ్ల శ్రీనివాస్, సంగెo సాయిగౌడ్, రాజు, శ్యాం కుమార్,తెల్ల చిన్న అరవింద్, నూకల రమేష్, సాయి ప్రసాద్,కట్టు పవన్, బర్ల సాయిలు, కాశీరాం తదితరులు ఉన్నారు.